Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:49:49
facebook Twitter Googleplus
Photo

విశ్వనటుడు కమల్ హాసన్.. ఇప్పటికే చాలాసార్లు ఆయన నట విశ్వరూపాన్ని మనకు చూపించేశారు. ఎంతగా నటించినా.. ఎంత కొత్తగా చేసినా తీరని తపన ఆయనది. అందుకే తనే విశ్వరూపం అంటూ సినిమా కూడా చేసేశారు. ఎన్నో ఇబ్బందుల తర్వాత విడుదలైన ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ మూవీ చివర్లో అర్ధాంతరంగా ఆగిపోగా.. మిగిలిన భాగం ఇండియాలో విశ్వరూపం2లో చూడమని టైటిల్ కార్డ్స్ వేస్తారు. అంటే బాహుబలి2 తరహా ఐడియా ముందు కమల్ కే వచ్చిందనమాట.

కాకపోతే అప్పటి నుంచి ఈ విశ్వరూపం సీక్వెల్ కు మోక్షం లభించలేదు. నిర్మాతల నుంచి సపోర్ట్ అందకపోవడంతో దాదాపుగా పూర్తయిపోయిన చిత్రం కూడా ఆగిపోయింది. కమల్ కు ఇలాంటివి కొత్త కాదు కానీ.. తనే దర్శకత్వం వహించి విశ్వరూపంపై ఆయన ఎంతో ప్రేమ పెంచుకున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నిర్మాణాన్ని తన హోం బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ కిందకు తీసుకొచ్చిన కమల్.. ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశారు. మొహానికి కట్లు కట్టుకుని సూటుతో ఉన్న కమల్ హాసన్.. గుండెలపై ఎగురుతున్న మువ్వన్నెల జాతీయ పతాకం ఈ పోస్టర్ లో కనిపిస్తాయి. జెండా మీదుగా తన గుండెలపై చెయ్యి వేసుకున్న కమల్ ఈ పోస్టర్ కి అసలు సిసలైన అట్రాక్షన్. కాకపోతే తొలి భాగంలో కాసేపు బ్రాహ్మణ డ్యాన్సర్ గా.. కాసేపు ఒక అఫ్గాన్ తీవ్రవాదిగా కనిపించిన కమల్.. ఇప్పడు ఇలా కనిపించడం.. ఏదో కొత్తగానే ఉంది.

రచన-దర్శకత్వ బాధ్యతలను కమల్ హాసన్ స్వయంగా నిర్వహించగా.. నిర్మాతలుగా సోదరుడు చంద్రహాసన్.. కమల్ హాసన్ లు వ్యవహరిస్తున్నారు.

,  ,  ,  ,  ,