Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:55:04
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు. రీసెంట్ గా తన కొడుకు గౌతమ్ బర్త్ డే కావడంతో.. భార్య-కొడుకు-కూతురుతో సహా దుబాయ్ ట్రిప్ కి వెళ్లాడు మహేష్. అక్కడ వారంపైగా టూర్ ప్లాన్ చేసుకోగా.. ఫ్యామిలితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడట సూపర్ స్టార్.

ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడంలో.. మహేష్ బాబు ఏ మాత్రం ఆలోచించడు. తన ఫ్రీ టైమ్ మొత్తాన్ని కుటుంబానికి కేటాయించేందుకే ప్రాధాన్యతనిస్తాడు. అలా మరికొన్ని రోజులు వరకు మహేష్ దుబాయ్ లోనే ఉంటాడట. అక్కడి నుంచి సెప్టెంబర్ ఆరున హైద్రాబాద్ కి చేరుకోనున్న మహేష్ బాబు.. వచ్చీ రాగానే అదే రోజున చెన్నై వెళ్లిపోతాడని తెలుస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఎక్కువ భాగం చెన్నైలోనే షూటింగ్ ప్లాన్ చేశారు. అందుకే చెన్నై వెళ్లి యూనిట్ తో కలవనున్నాడు మహేష్.

తన షెడ్యూల్స్ గ్యాప్ లో ప్రతీ రోజును కుటుంబానికే కేటాయించిన మహేష్ ని నిజంగా అభినందించాల్సిందే. ఇక మహేష్ నెక్ట్స్ మూవీకి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. రుకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ఈ సినిమాలో సూపర్ స్టార్ తో కలిసి కనిపించనుంది.

,  ,  ,  ,  ,