Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 11:03:49
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో కమర్షియల్ సక్సెస్ అందుకోడానికి ఏం చేయాలో బాగా తెలిసిన దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. రవితేజతో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలు చేసిన ఆయన తన సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. అంతేగాక అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను ఇచ్చాడు. ఆ తర్వాత మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రూపొందించి తేజ్ ను కమర్షియల్ హీరోని చేశాడు.
అలా ఇద్దరు మెగా హీరోలకి హిట్టుచ్చిన హరీష్ ఇప్పుడు మరో మెగా హీరో అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం చేస్తున్నాడు. టైటిల్ లోనే వైవిధ్యం నింపుకున్న ఈ చిత్రంపై ఆరంభం నుండే భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్, సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథాపరమైన విషయాలను బట్టి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమా సక్సెస్ అవడానికే ఎక్కువ అవకాశముంది. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం మెగా ఫ్యామిలీకి హరీష్ శంకర్ అందించే హ్యాట్రిక్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మరి హరీష్ శంకర్ ఈ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

,  ,  ,  ,  ,