Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Mar-2017 16:50:07
facebook Twitter Googleplus
Photo

సాయిధరమ్ తేజ్ గత ఏడాది చేసిన తిక్క డిజాస్టర్ అయినప్పటికీ విన్నర్ మీద ఆ ప్రభావం ఏమీ పడలేదు. ఈ సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి బిజినెస్ కూడా తేజు కెరీర్లోనే అత్యధికంగా రూ.27 కోట్ల వరకు జరిగింది. కానీ ఏం లాభం.. ఈ బిజినెస్ కు తగ్గట్లుగా కలెక్షన్లు రాలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ‘విన్నర్’ థియేట్రికల్ రన్ కొన్ని రోజుల కిందటే ముగిసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.16 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రూ.11 కోట్ల దాకా బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఇలాంటి మీడియం రేంజి సినిమాకు రూ.11 కోట్ల నష్టం అంటే చిన్న విషయం కాదు. ‘విన్నర్’ అని పేరు పెట్టుకున్న ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ ‘లూజర్’ అయిపోయింది. సినిమాను బాగానే అమ్ముకుని నిర్మాతలు లాభాలు అందుకున్నారు కానీ.. బయ్యర్లకే బ్యాండ్ పడింది.

ఫుల్ రన్లో ఏరియాల వారీగా ‘విన్నర్’ వరల్డ్ వైడ్ షేర్స్ వివరాలు..

నైజాం-రూ.5 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.75 కోట్లు

సీడెడ్ (రాయలసీమ)-రూ.2.55 కోట్లు

తూర్పు గోదావరి-రూ.1.4 కోట్లు

పశ్చిమగోదావరి-రూ.1 కోటి

గుంటూరు-రూ.1.2 కోట్లు

కృష్ణా- రూ.90 లక్షలు

నెల్లూరు-రూ.55 లక్షలు

కర్ణాటక-రూ.1.25 కోట్లు

యుఎస్- రూ.20 లక్షలు

మిగతా ఏరియాల్లో- రూ.20 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.14.35 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.21 కోట్లు

వరల్డ్ వైడ్ షేర్- రూ.16 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్-25 కోట్లు

,  ,  ,  ,  ,