Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

2019-05-09 18:07:54
facebook Twitter Googleplus
Photo

దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
నిర్మాత : రాజ్ కందుకూరి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
నటీనటులు : శ్రీ విష్ణు, నివేత పేతురాజ్, అమృత
పెళ్లి చూపులు సినిమాతో దాదాపు కొత్తవారిని పరిచయం చేసి మంచి విజయం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన తాజా సినిమా మెంటల్ మదిలో. శ్రీ విష్ణు, నివేత పెతురాజ్, అమృత హీరో హీరోయిన్స్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో సినిమా ఈ శుక్రవారం పేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ:
అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) చిన్నప్పటినుండి కన్ఫ్యూషన్ తో పెరుగుతాడు. రెండు ఆప్షన్స్ ఉంటే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడంలో సతమతమయ్యే అరవింద్ కు స్వేచ్ఛ (నివేత పెతురాజ్)కు పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటారు పెద్దలు. దీంతో అరవింద్, స్వేచ్ఛ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
అలాంటి టైంలోనే పని మీద అరవింద్ ఢిల్లీ వెళ్తాడు. అక్కడ రేణు(అమృత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇలా స్వేచ్ఛ, రేణు ఇద్దర్ని ప్రేమించిన అరవింద్ చివరికి ఎవర్ని ఎంచుకున్నాడు, అతని కన్ఫ్యూజన్ ఎలా దూరమైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ శ్రీ విష్ణు పాత్ర. ఎప్పుడూ స్తబ్దుగా, కన్ఫ్యూజన్లో ఉండే కుర్రాడిగా శ్రీ విష్ణు చాలా బాగా సెట్టయ్యాడు. ఆ పాత్ర ప్రేక్షకులకు వెంటనే కనెక్టైపోయేలా ఉంది. అందులో శ్రీవిష్ణు నటించిన తీరు కూడా బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ నివేత పేతురేజ్ మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంది. స్వేచ్ఛ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆమె వలన సినిమాకి, సన్నివేశాలకి కొత్తదనం, ఆహ్లాదం తోడయ్యాయి. ఆమెకి, శ్రీవిష్ణుకి మధ్యన రొమాంటిక్ ట్రాక్ కూడా బాగుంది.
సినిమాలోని మిడిల్ క్లాస్ సెటప్ కూడా చాలా బాగుంది. నటుడు శివాజీ రాజాకు చాలా రోజుల తర్వాత మంచి రోల్ లభించింది. ఆయన కూడా ఆ పాత్రలో బాగానే నటించారు. శ్రీవిష్ణుకి అతనికి మధ్యన మంచి ఫన్ జనరేట్ అయింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా సహజమైన, అవసరమైన పాత్రలను మాత్రమే రాసి సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. సినిమా నిర్మాణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు నిర్మాత రాజ్ కందుకూరి. మూవీ రిచ్ గా ఉండి నిర్మాణ విలువలు బాగున్నాయి
మైనస్ పాయింట్స్:
సినిమా మొదటి అర్థ భాగాన్ని మంచి రొమాంటిక్ గా, చాలా ఇంప్రెసివ్ గా చూపించడంతో సెకండాఫ్ కూడా అలానే ఉంటుందనే అంచనాలు పెరిగాయి. కానీ దర్శకుడు మాత్రం సెకండాఫ్ ను 15 నిమిషాల పాటు గ్రిప్పింగా లేని నరేషన్ తో నడిపించాడు. దీంతో ఆ కొద్దిసేపు బోర్ అనిపించింది.
సెకండ్ హీరోయిన్ కు హీరోకు మధ్యన ప్రేమ బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. అంతేగాక కొన్ని సన్నివేశాలు కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉన్నాయి కూడ.
సాంకేతిక విభాగం:
నూతన దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫస్టాఫ్ ను చాలా బాగా నడిపిన ఆయన సెకండాఫ్ ను కూడా ఇంకాస్త బెటర్ గా నడిపి ఉంటే సినిమా ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది. ప్రశాంత్ ఆర్ విహారి పాటలకు అందించిన సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా బాగుంది.
వేదరామన్ కెమెరా పనితనం బాగుంది. సినిమా మొదటిసగం ఎక్కువగా ఇంట్లో చిత్రీకరించారు, ఆ సన్నివేశాల్లో లైటింగ్, ఫ్రేమింగ్ బాగా కుదిరి సన్నివేశాలు చూడ్డానికి అందంగా ఉన్నాయి. విప్లవ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత రాజ్ కందుకూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మొత్తం మీద ఈ మెంటల్ మదిలో చిత్రం ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మంచి రొమాన్స్, ఆకట్టుకునే నటీ నటుల నటన, లైటర్ వేలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, డైలాగులు అన్నీ కలిసి సినిమాను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేస్తాయి. సినిమా లైన్ సాధారణమైనదే అయినా అందులోని శ్రీవిష్ణు పాత్ర సినిమా చివరి వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులను, యువతను బాగా ఆకట్టుకోవడమేగాక వారాంతంలో మంచి సినిమాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ సినిమాను చూడొచ్చు.
Rating:3.25/5

(Average Rating 5.0 Based on 1 views)
,  ,  ,  ,  ,