Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

2019-05-09 17:46:59
facebook Twitter Googleplus
Photo

దర్శకత్వం : చరణ్ లక్కాకుల
నిర్మాత : డా. కె.రవి కిరానే
సంగీతం : బుల్గేనిన్
నటీనటులు : సప్తగిరి, కాశిష్ వోహ్రా
గతేడాది సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటుడు సప్తగిరి చేసిన రెండో ప్రయత్నమే సప్తగిరి ఎల్.ఎల్.బి. ఈరోజే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం
కథ :
చిత్తూరులో ఉంటూ ఎల్.ఎల్.బి పూర్తిచేసిన సప్తగిరి లాయర్ గా ఎదిగి మంచి పేరు, డబ్బు సంపాదించి తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీకి వచ్చి సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ పెట్టి కేసులకు ఎదురుచూస్తుంటాడు.
అలాంటి తరుణంలోనే అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) వాదించి, తీర్పు రాబట్టుకున్న ఒక హిట్ అండ్ రన్ కేసుపై పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు సప్తగిరి ఆ కేసుని ఎందుకు రీ ఓపెన్ చేయిస్తాడు, ఆ కేసు కథేంటి, పేరు మోసిన లాయర్ రాజ్ పాల్ ను సప్తగిరిని ఎలా ఢీ కొట్టాడు, చివరికి కేసు గెలిచాడా, లేదా అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్లస్ పాయింట్ అంటే సప్తగిరి టేకప్ చేసిన కేసులో వాదన, తీర్పు అనే అంశాలే. సప్తగిరి తాను రీ ఓపెన్ చేయించిన కేసులోని అసలు వాస్తవాల్ని తెలుసుకుని, ఆ కేసులో న్యాయం ఎంత అవసరమో గ్రహించి బాధితుల తరపున పోరాడటం అనే ఎపిసోడ్ ఆకట్టుకుంది. విచారణ సమయంలో ఫేమస్ లాయర్ రాజ్ పాల్(సాయి కుమార్) ను సప్తగిరి ఎదిరించే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అహం, తెలివి తేటలు కలిగిన లాయర్ గా సాయి కుమార్ నటన చాలా బాగుంది.
ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సన్నివేశాల్లో పేదవారికి న్యాయం జరగాల్సిందే అంటూ సాగే ఎమోషన్ బాగా క్యారీ అయింది. సినిమా ఆఖరులో వచ్చే ఈ ఎపిసోడ్స్ సినిమా ఫలితాన్ని కొద్దిగా మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. అంతేగాక ఇంటర్వెల్ ముందు హీరోకి కనువిప్పు కలగడానికి కారణమైన చిన్నపాటి ట్విస్ట్ ఆకట్టుకుంది. జడ్జిగా శివ ప్రసాద్ నటన ఆకట్టుకుంది. సప్తగిరి ఈసారి కూడా డ్యాన్సుల్లో తన ప్రతిభ చూపించాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన బలహీనత ఆకట్టుకునే కథనం లేకపోవడం. ఫస్టాఫ్ ఆరంభం నుండి ఇంటర్వెల్ వరకు ఎక్కడా బాగా నవ్వుకునే, సినిమాపై ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఏవీ లేవు. ఏదో సాగాలి కాబట్టి సాగుతున్నట్లు అనిపించింది. అలాగే సెకండాఫ్లో కూడా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మినహా అంతా చాలా సాదా సీదాగానే ఉంది. అంతేగాక ప్రత్యర్థి లాయర్ రాజ్ పాల్ ను మొదటి నుండి చాలా ఇంటెలిజెంట్ గా చూపించి చివరకు సింపుల్ గా తేల్చేయడంతో హీరో పాత్రలో ఎలివేషన్ తగ్గింది.
ఇద్దరు లాయర్లు ఢీకొంటున్నారు అంటే వారి మధ్య క్రిమినల్ బ్యాక్ డ్రాప్లో అన్ని లాజిక్స్ తో ఒక మైండ్ గేమ్ సెటప్ ఏమైనా ఉంటుందని ఊహిస్తే అలాంటిదేం లేకుండానే విచారణ, తీర్పు అన్నీ జరిగిపోతాయి. హీరో కేవలం రెండు ఫైట్స్ చేసి, ఆఖరున కాసేపు స్పీచ్ ఇచ్చి కేసును గెలిచేస్తాడు. ఈ లోపాల వలన కథలో ఎగ్జైట్మెంట్ దొరకలేదు. మధ్య మధ్యలో వచ్చే హీరో లవ్ ట్రాక్, పాటలు కథనానికి అడ్డుతగులుతున్నట్లు తోచాయి. కామెడీ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు చరణ్ లక్కాకుల సినిమా కోసం ఎంచుకున్న న్యాయం కోసం పోరాడే లాయర్ అనే పాయింట్ బాగానే ఉన్నా ఆకట్టుకునే కథనాన్ని రాయలేదు. ముఖ్యమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప మిగతా వీటి మీదా పెద్దగా పనితనం చూపలేదు. దీంతో చిత్ర ఏదో ఉంది అన్నట్టు మిగిలింది తప్ప స్టాంప్ వేయగలిగిన చిత్రంగా నిలవలేకపోయింది.
సన్నివేశాల టేకింగ్ కూడా ప్రభావవంతంగా లేదు. బుల్గేనిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటల సంగీతం మెప్పించలేదు. సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది, గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు. సప్తగిరి వేసిన డ్యాన్సులు బాగున్నాయి. డా. కె.రవి కిరానే పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
హీరో సప్తగిరి చేసిన ఈ రెండవ సినిమా సప్తగిరి ఎల్.ఎల్.బి అనుకున్నంత ఫలితం చూపించలేదు. ఇంప్రెస్సివ్ గా అనిపించే సినిమా పాయింట్, కాస్త ఎమోషనల్ గా ఉండే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నా ఆకట్టుకునే కథనం, సన్నివేశాలు, లాయర్స్ మధ్యన ఉండాల్సిన మైండ్ గేమ్ లేకపోవడం వంటి లోపాల వలన చిత్రం మేజర్ పార్ట్ వరకు బోర్ కొట్టింది. కొద్దిగా సహనాన్ని చూపిస్తే ఎమోషనల్ గా ఉండే సోషల్ కంటెంట్ కలిగిన బాగుందనిపించే ఫినిషింగ్ కోసం చూడొచ్చు.
Rating:2.5/5

(Average Rating 5.0 Based on 1 views)
,  ,  ,  ,  ,