ఎంసీఏ థియేటర్లలోకి వచ్చేసింది. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా టాక్ తేడాగా ఉంది. యావరేజ్ టాక్ వచ్చిన మజ్ను లాంటి సినిమాలు కూడా హిట్ పట్టాలెక్కాయంటే అది నాని క్రేజ్ మాత్రమే కారణం. అభిమానులు అంతగా ఈ న్యాచురల్ స్టార్ పై నమ్మకాలు పెట్టేసుకున్నారు.
కానీ మిడిల్ క్లాస్ అబ్బాయి విషయంలో మాత్రం తేడా వచ్చేసింది. సెకండాఫ్ విషయంలో ఆడియన్స్ లో మరీ డిజప్పాయింట్ మెంట్ కనిపిస్తోంది. అయితే.. దిల్ రాజు అన్ని సినిమాల మాదిరిగానే.. ఎంసీఏకు కూడా రిలీజ్ రోజు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టేసి.. హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. కలెక్షన్స్ అదిరిపోతున్నాయని నాని కూడా చెప్పేస్తున్నాడు. ఇంతగా సక్సెస్ ట్రాక్ ఉన్నపుడు.. మొదటి రోజు షోస్ కి హౌస్ ఫుల్స్ పడ్డంలో వింతేమీ లేదు కానీ.. అదే హిట్ కి కొలమానం అన్నట్లుగా నాని చెప్పడం ఆశ్చర్యకరం. నాని స్పీచ్ వింటుంటే.. ఎంసీఏ సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉంది.
కాకపోతే నాని స్పీచ్ లోనే ఓ పాయింట్ ఉంది. నాలుగైదు రోజులు పోతే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుందని అన్నాడు నాని. మరి ఈ నాలుగు రోజులు.. ముఖ్యంగా క్రిస్మస్ అయ్యేవరకూ వసూళ్లు నిలబడితే.. నాని ఇప్పుడు చెప్పిన కబుర్లు నిజమవుతాయి