Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 12:28:09
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ట్రెండ్ మార్చాడు. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాల నుంచి బయటకొచ్చి డిఫరెంట్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. ఇది బాగా వర్కవుటయింది. ఇటు సినిమాలు హిట్టవడంతోపాటు మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరొచ్చింది. ముఖ్యంగా గతేడాది వచ్చిన నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండింటిలో తారక్ నటనకు విమర్శకులు ప్రశంసలు సైతం వచ్చాయి. జనతా గ్యారేజ్ సినిమా అతడి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా కావడం విశేషం.

ఈ రెండు సినిమాల్లో నటనతో ఉత్తమ నటుడి అవార్డులన్నీ ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ముందు ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్నాడు. ఆ వెంటనే జీ సినిమా నుంచి బాక్సాఫీస్ కింగ్ పురస్కారం అందుకున్నాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫేర్ అవార్డు కూడా తారక్ నే వరించింది. రీసెంట్ గా స్టార్ట్ చేసిన శంకరాభరణం అవార్డు కూడా అతడికే సొంతమైంది. లేటెస్ట్ గా సైమా ఉత్తమ నటుడి అవార్డు కూడా ఎన్టీఆర్ కే దక్కింది. ఇవన్నీ కొద్ది రోజుల తేడాలోనే అందుకోవడం విశేషం. ఇలా వరసపెట్టి అవార్డులన్నీ వచ్చేస్తుండటంతో అతడి అభిమానులంతా ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. ఇప్పుడంతా తా‘రాక్’ మేనియా నడుస్తోందంటూ సంబరాలు చేసేసుకుంటున్నారు.

తారక్ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఇలా అవార్డులన్నీ అతడిని వరించాయి. మళ్లీ చాలాకాలం తర్వాత ఈ ఫీట్ రిపీటవుతోంది. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండూ ఎన్టీఆర్ కు బాగా ప్లస్సయ్యాయి. నిర్మాతలకు డబ్బులు.. తనకేమో అవార్డులు.. అభిమానులకు ఆనందం పంచాయి.

,  ,  ,  ,