Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2016 14:36:54
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ మ్యాజిక్ స్థాయి ఎంతటిదో ?అ..ఆ..? సినిమాతో మరోసారి ఋజువైన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా నితిన్ కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలవడమే కాక, తాజాగా 50 కోట్ల మార్క్‌ను కూడా చేరుకుంది.
తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ పర్ఫామెన్స్‌కు ఓ మైలురాయిగా చెప్పబడే 50 కోట్ల మార్క్‌ను ?అ..ఆ..? నెలరోజులు ముగిసేసరికల్లా చేరుకుంది. ఒక ఫీల్‌గుడ్ రొమాంటిక్ సినిమా, పెద్దగా హడావుడి చేయకుండా థియేటర్లకు వచ్చేసి ఈ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టడం విశేషమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగులో టాప్ 3 సినిమాల్లో ఒకటిగా ?అ..ఆ..? నిలవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,