Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2017 10:11:01
facebook Twitter Googleplus
Photo

గుర్తింపు తెచ్చుకుంటేనే ఎలాంటి పాత్రలైనా చేయవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఇదే రూట్ లో నడుస్తున్నారు. అవసరం అయితే వారి స్టార్ ఇమేజ్ ను పక్కనపెట్టి మరి కొన్ని ప్రయోగాత్మకమైన క్యారెక్టర్లను చేస్తున్నారు. చేసేది నెగిటివ్ పాత్ర అయినా సరే ప్రేక్షకుల ఆకర్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరహాలో ఆది పినిశెట్టి కూడా తన అదృష్టాన్ని చాలా రకాలుగా పరీక్షించుకుంటున్నాడు.

మొదట హీరోగా ట్రై చేసిన ఆది ఈ మధ్యన ప్రత్యేక పాత్రల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరైనోడు సినిమాలో విలన్ గా అలరించి ఆ తర్వాత నిన్ను కోరి సినిమాలో స్పెషల్ రోల్ చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి మెగా హీరోతో పోట్లాడడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలో ఆది కూడా నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి మరొక మంచి న్యూస్ వెలువడింది.

ఆది - రామ్ చరణ్ ఇద్దరు సినిమాలో అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారట. కథలో ఆది రామ్ చరణ్ పాత్రని డామినేట్ చేసేలా ఈర్ష తో ఉంటుందని తెలుస్తోంది. చాలా సినిమాల్లో ఇలాంటివి చూశాం గాని దర్శకుడు సుకుమార్ మాత్రం తన మేకింగ్ స్టైల్ లో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నాడట. ఇక ఇద్దరి మధ్యన ఒక ఫైట్ సిన్ సినిమాకు హైలెట్ గా నిలవనుందట.

,  ,  ,  ,  ,