Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2017 12:03:19
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి నెలకొంది. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్.. ఇలా ప్రతి స్టారూ ఆ సినిమా గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు. బాహుబలి: ది కంక్లూజన్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాక తమ సినిమాల ప్రమోషన్లకు వచ్చిన ఈ స్టార్లందరికీ ముంబయి మీడియా నుంచే బాహుబలి ప్రశ్నలు చాలా ఎదురయ్యాయి. ఇక హైదరాబాద్ వస్తే వాళ్లను ఈ సినిమా గురించి అడక్కుండా ఎలా ఉంటారు. తన కొత్త సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్.. బాహుబలి ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ సినిమా గురించి.. రాజమౌళి.. ప్రభాస్ ల గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు అమీర్. తాను బాహుబలి: ది బిగినింగ్ మాత్రమే చూశానని.. ది కంక్లూజన్ ఇంకా చూడలేదని అమీర్ చెప్పడం విశేషం.

బాహుబలిని రాజమౌళి అద్భుతంగా తీశాడని.. ఆయన గొప్ప కథకుడని.. అందుకే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ బాహుబలి ఆదరణ పొందిందని అమీర్ అన్నాడు. తాను బాహుబలి: ది బిగినింగ్ చూశానని.. బాగా నచ్చిందని.. కానీ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడనే విషయం మాత్రం తనకు తెలియదని.. తాను రెండో భాగం చూడకపోవడమే అందుకు కారణమని అన్నాడు అమీర్. తాను ఈ విషయం ఎవరినీ అడగలేదని.. అడగను కూడా అని.. త్వరలోనే బాహుబలి: ది కంక్లూజన్ చూసి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటానని అన్నాడు అమీర్. ప్రభాస్ బాహుబలి గా అద్భుత అభినయం కనబరిచాడని.. అతను తనకు నచ్చాడని అమీర్ చెప్పాడు.

,  ,  ,  ,