Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 15:55:20
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు వింత ఏంటంటే.. ఈ దసరాకు వస్తున్న సినిమాలన్నీ ఒకటే రకంగా ఉండబోతున్నాయి. అంటే ఒకే రకం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటే మరి ఒకే రకమైన కంటెంట్ అని కామన్ గా జనాలు అనుకోకుండా ఉంటారా?

అదేంటో తెలియదు కాని.. అసలు ప్యూర్ లవ్ స్టోరీ అనుకున్న తరువాత కూడా ''ప్రేమమ్'' కూడా రొమాన్స్ అండ్ కుర్రాళ్ళ జోక్స్ డోసు ఎక్కువ కావడంతో.. ఆ సినిమాకు కూడా యు/ఎ సర్టిఫికేట్ నే ఇచ్చారు సెన్సార్ వారు. ఇకపోతే 100 కోట్ల భారీ బడ్జెట్ తో తమ కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్నారు కాబట్టి.. ఆ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే అనుకున్నారేమో. అందుకే ఇప్పుడు ''జాగ్వార్'' సినిమాకు కూడా యు/ఎ నే వచ్చింది. అలాగే సునీల్ అందిస్తున్న మాస్ మసాలా సినిమా ''ఈగు గోల్డ్ ఏహా'' సినిమాకు కూడా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆ సర్టిఫికేట్ సరైనదే అని హీరోయిన్ల గ్లామరసం చూసిన ఎవరైనా అంటారులే. ఈ సినిమాలన్నీ కూడా అక్టోబర్ 7నే రిలీజవుతున్నాయి అని వేరే చెప్పక్కర్లేదు.

ఇకపోతే అదే రోజు విడుదలవుతున్న మిల్కీ బ్యూటి తమన్నా ''అభినేత్రి'' కూడా ఇప్పుడు యు/ఎ సర్టిఫికేటే తెచ్చుకుంది. ఇప్పటికే టీజర్లో ట్రైలర్లో తమన్నా అందాలు చూశాక.. ఇక ఆ సర్టిఫికేట్ కాకపోతే ఇంకే సర్టిఫికేట్ ఇస్తారులే అని అనుకుంటున్నారా.. ప్చ్.. అదీ నిజమే!!

,  ,  ,  ,  ,