Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:19:50
facebook Twitter Googleplus
Photo

తమిళం అండ్ హిందీలో ఇదేదో ప్రభుదేవా సినిమా.. సోనూసూద్ సినిమా.. అనే తరహాలో ప్రచారం చేశారు కాని.. తెలుగులో మాత్రం ''అభినేత్రి'' పక్కా మిల్కీ సైరన్ సినిమాయే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి 9-9-9-9న కాకుండా.. ఈ ఆదివారం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంతకీ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? పదండి చూద్దాం.

ఒక ఇంట్లో ఉండే తమన్నా.. ఆ ఇంట్లో ఒకప్పుడు ఉండి చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మపూనుకోవడంతో.. సినిమా హీరోయిన్ అవుతుంది. ఆ తరువాత ఆమెతో పాటే ఉండే ప్రభుదేవాకు ఈ విషయం అర్దమవుతుంది. ఇంతలో ఒక సినీ హీరో (సోనూ సూద్) ఆమెకు దగ్గరవుతుంటాడు. అప్పుడు ఏం జరిగింది అనేదే కథ. ఇక తమిళ - హిందీ ట్రైలర్లు కూడా చూస్తే తెలిసే విషయం ఏంటంటే.. పల్లెటూరిలో ఒక పనమ్మాయిగా ఉన్న తమన్నాను పెళ్లిచేసుకుని పట్టణం తీసుకొస్తాడు ప్రభుదేవా. ఆ తరువాత ఈమె హీరోయిన్ అవుతుంది. అదన్నమాట. సోనూ సూద్ ఈమెను పొగుడుతూ ఈమె వెంట పడుతుంటాడు. ఈమె మరో శ్రీదేవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. ఇంతకీ ఒక ఇంట్లో ఉండే ఆత్మ తమన్నాను హీరోయిన్ గా సినీ ఫీల్డులోకి ఎంటర్ అవ్వడానికి ఎందుకు ప్రోత్సహిస్తుంది అనేదే ఇంట్రస్టింగ్ పాయింట్.

హీరోయిన్ అమలా పాల్ భర్త (త్వరలో మాజీ) ఏ.ఎల్.విజయ్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే ట్రైలర్ల కూడా బాగానే ఉన్నాయి. ఇక తమన్నా రేపెట్టిన హాటు గురించి చెప్పక్కర్లేదు. మరి అక్టోబర్ 7న వీరు 'దసరా' హిట్టు కొడతారా? వెయిట్ అండ్ సి.

,  ,  ,  ,  ,