Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 10:54:44
facebook Twitter Googleplus
Photo

తెలుగులో హీరోగా నిలదొక్కుకోవడానికి సాయికుమార్ తనయుడు ఆది గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు కానీ.. అతడికి సరైన ఫలితాలు రావట్లేదు. ప్రేమకావాలి.. లవ్లీ లాంటి సినిమాలతో ఆరంభంలో పర్వాలేదనిపించాడు కానీ.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఈ ఏడాది గరం.. చుట్టాలబ్బాయి లాంటి ఫ్లాపులు తిన్న ఆది.. ఇక టాలీవుడ్లో లాభం లేదని.. తన తండ్రికి మంచి ఫాలోయింగ్ ఉన్న శాండిల్ వుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తెలుగులో సూపర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ?కార్తికేయ?ను రీమేక్ చేయాలనుకున్నాడు. ఆది హీరోగా కార్తికేయ రీమేక్ ఇక ఆరంభమవడమే తరువాయి అన్నారు.

కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ?కార్తికేయ? కన్నడ రీమేక్ లో వేరే హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ?అదిగో? సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న అభిషేక్ వర్మ.. ?కార్తికేయ? కన్నడ రీమేక్ లో హీరోగా చేస్తున్నాడట. అతడి తండ్రే ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మిస్తున్నాడట. ?కార్తికేయ? రీమేక్ హక్కులు వాళ్ల దగ్గరే ఉన్నట్లు సమాచారం. మరి ఆది వదిలేస్తే ఈ సినిమా అభిషేక్ దగ్గరికి చేరిందా లేక వీళ్ల కంటే ముందు వాళ్లు కర్చీఫ్ వేసేశారా అన్నది తెలియడం లేదు. ?కుమారస్వామి? పేరుతో ఈ రీమేక్ కోసం అభిషేక్ తండ్రి టైటిల్ కూడా రిజిస్టర్ చేయించేశారట. త్వరలోనే షూటింగ్ ఆరంభమవుతుందని సమాచారం.

,  ,  ,  ,  ,  ,