Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 12:11:22
facebook Twitter Googleplus
Photo

2015లో మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైంది అదితి ఆర్య. ఇప్పుడీమెను టాలీవుడ్ లో అరంగేట్రం చేయించేందుకు రంగం సిద్ధమైంది. అది కూడా కొత్త హీరోయిన్లను గ్రాండ్ గా లాంఛ్ చేసే పూరీ జగన్నాథ్ సినిమాతో కావడం విశేషం. కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో.. అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది.

మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఏడాదికే సినీ రంగ ప్రవేశం అది కూడా టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడంపై.. ఆసక్తి కలిగించే కామెంట్స్ చేసింది అదితి. 'అతి పెద్ద సినీ పరిశ్రమల్లో టాలీవుడ్ ఒకటి. ఇక్కడ రూపొందిన పలు చిత్రాలు బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యాయి. నేను తెలుగు సినిమాలు ఎక్కువగానే చూస్తాను. నా ఫేవరేట్ యాక్టర్ ఎవరో తెలుసా.. మహేష్ బాబు' అని చెప్పింది అదితి.

కళ్యాణ్ రామ్-పూరీ కాంబినేషన్ లో చేసే సినిమా చేసే ఆఫర్.. తను మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకోకముందే వచ్చింతట. ఆ అందాల పోటీల రోజున కూడా స్టేజ్ వెనక తెలుగు స్క్రిప్ట్ ను ప్రాక్టీస్ చేసిందట అదితి. తను గెలిచిన మరుసటి రోజే.. పూరీ సినిమాకి ఆడిషన్ టేప్ ను పంపానని.. పూరీ సినిమాతో పరిచయం అవుతున్నందుకు తెగ హ్యాపీగా ఉందంటోంది అదితి ఆర్య. ఇప్పటికే స్పెషల్ క్లాసులు పెట్టించుకుని మరీ తెలుగు నేర్చుకుంటున్నానని.. తెలుగు ఇండస్ట్రీలో పర్మనెంట్ గా ఉండిపోయే ఆలోచన ఉందని చెప్పడం విశేషం.

,  ,  ,  ,  ,  ,