Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Dec-2017 10:12:18
facebook Twitter Googleplus
Photo

అజ్ఞాతవాసి టీజర్ చూసి సోషల్ మీడియాలో జనాలు చేస్తున్న కామెట్ ఇది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కలిసి చివరగా చేసిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్టయిన నేపథ్యంలో ఇద్దరూ కలిసి మళ్లీ అదే తరహా ఎంటర్టైనర్ తో వస్తున్నారన్న ఫీలింగ్ కలిగించింది అజ్ఞాతవాసి టీజర్.

ఇందులోని విజువల్స్.. పాత్రలు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్.. అతడి హావభావాలు.. అన్నీ కూడా అత్తారింటికి దారేది ని గుర్తు తెచ్చాయనడంలో సందేహమే లేదు. అత్తారింటికి దారేది లో దేవ దేవం భజే.. పాట తరహాలోనే ఇక్కడ కూడా ఒక పాత కాలం కీర్తనను బ్యాగ్రౌండ్ లో వినిపించడంతోనే ఆ సినిమాను గుర్తుకు తెచ్చింది ఈ టీజర్. ఇక పవన్ ఫైట్లయితే అచ్చంగా అత్తారింటికి దారేది తరహాలోనే ఉన్నాయి. అమ్మాయిలా అతడి హావభావాలు.. హీరోయిన్లతో రొమాన్స్.. ఇదంతా ఆ సినిమానే తలపించాయి.

బొమన్ ఇరానీ బ్లాక్ అండ్ వైట్లో కనిపించడం.. నదియా తరహాలో ఇందులో ఖుష్బు పాత్ర డిజైన్ చేసినట్లుగా ఉండటం.. ఇంకా చాలా రకాలుగా అత్తారింటికి దారేది తలపుల్లోకి వస్తోంది. దాని మాదిరే దీన్ని కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీర్చిదిద్దినట్లున్నాడు త్రివిక్రమ్. ఐతే ఈ పోలికల మాటెలా ఉన్నా.. అత్తారింటికి దారేది తరహాలోనే ఇది కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఎంటర్ టైన్ చేసేలా ఉంది.

,  ,  ,  ,  ,