Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 11:19:22
facebook Twitter Googleplus
Photo

ఇండియాలో పాపులర్ హీరోయిన్లు అందరూ అయితే బెంగుళూరు నుండి లేకపోతే కేరళ నుండి వచ్చిన వారు అయి ఉంటారు. ఇప్పుడు మన తెలుగు తమిళ్ సినిమాలలో చాల మంది హీరోయిన్లు అక్కడ నుండే వచ్చినవారే. మలయాళం హీరోయిన్లు అంటే కొంచం క్రేజ్ కూడా ఉంది లెండి మన దగ్గర. బాగా నటిస్తారు అనో లేక అందంగా ఉంటారు అనో తెలియదు కాని ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్లులలో 50 శాతం అమ్మాయిలు అక్కడవారే. ఇప్పుడు మరో మలయాళం అమ్మాయి తెలుగు తెరపై తన అదృష్టం పరీక్షించుకోవడానికి తయారైంది.

ఐశ్వర్య లక్ష్మి అనే మలయాళం సుందరి తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరో కల్యాణ్ రామ్ నటించబోతున్న సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకునట్లు తెలుస్తుంది. ఈ కొత్త సినిమా డైరెక్టర్ జయేంద్ర.. ఐశ్వర్య ఫోటో షూట్లు చూసి తన సినిమాకు సరైన అమ్మాయి ఈమెనే అని ఫిక్స్ చేశాడంట. ఈ సినిమా ఆఫర్ రాకముందు ఐశ్వర్య కొన్ని టివి కమర్షియల్ యాడ్స్ లో మోడల్ గా చేసింది. ఇప్పుడు ఈమె తన తెలుగు సినిమా కోసం తెలుగు భాష నేర్చుకుంటోంది. ఫిదా హీరోయిన్ సాయి పల్లవి తరహాలో ఈమెకూడా సొంత డబ్బింగ్లా చెప్పుకుంటుందట. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఐశ్వర్యా కూడా సాయి పల్లవి లాగానే ఎంఎంబిఎస్ చదివింది.

సౌత్ సినిమాలలో మలయాళం నుండి వస్తున్న పాపల హవా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కొంత మంది స్టార్ హీరోయిన్లు అవుతున్నారు మరికొంత మంది అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు అని హీరోయిన్లు గా మారిపోతున్నారు.

,  ,  ,  ,