Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 11:31:20
facebook Twitter Googleplus
Photo

ఓ సెలెబ్రెటీ ఎంత సైలెంటుగా ఉంటే జనాలకు.. ఆ వ్యక్తి గురించి అంత ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల్ని దాచి పెట్టే కొద్దీ ఆ విషయాలపై క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ఆయన అభిరుచుల గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపించేది ఇందుకే. పవన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డం చాలా తక్కువ. బయటి వాళ్లే ఆయన అభిరుచులు.. ఇష్టాఇష్టాల గురించి.. ఆయనతో తమ అనుభవాల గురించి చెబుతూ ఉంటారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ కూడా పవన్ తో తనకున్న అనుభవాల్లోంచి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.

పూరి తొలి సినిమా ?బద్రి? చేస్తున్న టైంలో ఆకాశ్ చిన్న పిల్లవాడట. రింగులు తిరిగిన భలే బబ్లీగా ఉండేవాడట ఆకాశ్ అప్పట్లో. అతడితో.. అతడి జుట్టుతో పవన్ సరదాగా ఆడుకునేవాడట. ఆకాశ్ కు మూడే ఏట వరకు పుట్టెంటుకలు తీయకపోవడం వల్ల జుట్టు బాగా పెరిగిపోయి.. రింగులు తిరిగి చూడ్డానికి చిత్రంగా ఉండేదట. పవన్ ఆ జుట్టుతో ఆడుకునేవాడట. ?బద్రి? తర్వాత పవన్ మళ్లీ పూరితో పని చేసింది ?కెమెరా మన్ గంగతో రాంబాబు? సినిమాకే. ఆ సమయానికి ఆకాశ్ పెద్దవాడైపోయాడు. అప్పుడెళ్లి పవన్ ను కలిస్తే.. నీకు రింగుల జుట్టు ఉండేది కదా.. అదేమైంది అని అడిగాడట పవన్. తన చిన్నప్పటి విషయాల గురించి అడిగేసరికి ఆశ్చర్యపోయాడట ఆకాశ్. చిన్నపుడు తనకు రింగుల జుట్టు ఉన్న సంగతి ఆకాశ్ కు తెలియదట.

,  ,  ,  ,  ,