Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 15:27:55
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లో స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుని బ్రాండ్ అండార్స్ మెంట్స్ దక్కించుకునేవాళ్లు చాలామందే ఉంటారు. కాని అక్కినేని అఖిల్ మాత్రం అరంగేట్రానికి ముందు నుంచే కమర్షియల్ యాడ్స్ చేసేస్తున్నాడు. తన రెండో సినిమాకి కొబ్బరికాయ కొట్టేందుకు రెడీ అవుతున్న అఖిల్.. ప్రస్తుతం యాడ్ షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు.

మౌంటెన్ డ్యూ బ్రాండ్ కు అఖిల్ అంబాసిడర్ అనే విషయం తెలిసిందే. ఈ కంపెనీ లేటెస్ట్ యాడ్ షూట్ కోసం ముంబైలో ఉన్నాడు అఖిల్. మరి ముంబై అన్నాక ఈ హీరోకి బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అటు ప్రకటన కోసం షూటింగ్ తో పాటు.. ఇటు స్నేహితులను చక్కర్లు కొట్టేస్తున్నాడు అఖిల్. డే టైంలో షూటింగ్.. ఈవెనింగ్ ఫ్రెండ్స్ తో పార్టీ.. ముంబైలో అఖిల్ హంగామా బాగానే నడిచిపోతోంది.

మరోవైపు డిసెంబర్ లో అఖిల్ రెండో సినిమా ప్రారంభం కోసం గ్రాండ్ ఈవెంట్ ఏర్పాట్లు చేస్తున్నాడు నాగార్జున. అఖిల్ రీలాంఛింగ్ ఈవెంట్ గా దీన్ని నిర్వహించబోతున్నారు. ఇక అఖిల్ కి ఎంగేజ్మెంట్ కూడా డిసెంబర్ లోనే అని తెలుసు కదా. రాబోయే డిసెంబర్ అంతా అఖిల్ ఫుల్లు బిజీ బాబూ

,  ,  ,  ,  ,