Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2017 13:36:10
facebook Twitter Googleplus
Photo

అఖిల్ హీరోగా రెండో సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. అఖిల్ మొదటి సినిమా విషయంలో చాలానే రూమర్స్ హంగామా చేశాయి. అఖిల్ కి జోడీగా మెగా డాటర్ నీహారిక నటిస్తోందంటూ అప్పట్లో న్యూస్ బాగానే హల్ చల్ చేసింది.

అయితే.. అఖిల్ అరంగేట్ర చిత్రం అఖిల్ లో సాయేషా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు ఆ రూమర్ రావడానికి అసలు కారణమేంటో చెప్పాడు అఖిల్. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఓ షార్ట్ ఫిలింలో నటించారట. అది కూడా చాలా పెద్ద టీంతో షూటింగ్ చేశారట. దాదాపు 120 మంది ఈ షార్ట్ ఫిలిం కోసం వర్క్ చేశారని చెప్పాడు అఖిల్. షార్ట్ ఫిలింని కూడా పెద్ద కాన్వాస్ పై చిత్రీకరించారని అన్నాడు అఖిల్. అంతే కాదు.. దీనికోసం బడ్జెట్ కూడా బాగానే కేటాయించారట. పైగా దీనికి దర్శకుడు ఎవరో తెలుసా.. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ.

భారీగానే ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణ జరగడంతో.. చాలామంది తామిద్దరం కలిసి సినిమాలో నటించినట్లుగా పొరపడ్డారని అన్నాడు అఖిల్. అయితే.. ఈ షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ కాలేదు. ఔట్ పుట్ అనుకున్నట్లుగా రాకపోవడంతోనే ఈ షార్ట్ ఫిలింను రిలీజ్ చేసి ఉండరని అన్నాడు అక్కినేని అఖిల్.

,  ,  ,  ,  ,