Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 10:50:02
facebook Twitter Googleplus
Photo

త్వరలోనే అఖిల్ రెండో సినిమా మొదలవబోతోంది. `మనం` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఓ విభిన్నమైన ప్రేమకథతో ఆ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. మనం చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే నాగార్జునకి విక్రమ్ ఓ కథ చెప్పాడట.

ఆ కథనే ఇప్పుడు అఖిల్ తో తెరకెక్కించనున్నట్టు సమాచారం. అయితే ఆ కథ ఇదే అంటూ రెండు రోజులుగా ఫిల్మ్ నగర్ లో ఓ లైన్ ప్రచారమవుతోంది. హిందూ - ముస్లిం కుటుంబాల నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కబోతోందని... అఖిల్ హిందూ కుటుంబంలో పుట్టి ముస్లిం కుటుంబంలో పెరిగిన యువకుడిగా కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. మరి అందులో నిజమెంతన్నది చూడాలి. విక్రమ్ ఇటీవలే పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం హానీమూన్ లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. అప్పుడు కొబ్బరికాయ కొడితేగానీ అసలు కథ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. `మనం`తో తన కుటుంబానికి ఓ మరపురాని చిత్రాన్ని అందించిన విక్రమ్... అఖిల్ కీ తిరుగులేని విజయాన్ని అందిస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు నాగార్జున.

,  ,  ,  ,