Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 15:54:47
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్ తీసే సినిమాల్లో కొంతమంది రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్లలో ఈడియట్ సినిమాలో తన బైక్ దొంగతనాలతో బీభత్సంగా నవ్వించిన ఆలీ.. తరువాత పోకిరి వంటి సినిమాల్లో బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పిచ్చి పీక్సుకు తీసుకెళ్ళాడు. కాని తరువాత తరువాత పూరి సినిమాల్లో ఇతగాడి కోసం రాసే పాత్రల గ్రాఫ్ పడిపోయింది. టెంజర్.. లోఫర్.. ఇజం.. రోగ్.. ఇలా పూరి జగన్ సినిమాలన్నింటిలోనూ కనిపించి కూడా ఈసారి ఇంప్రెస్ చేయలేకపోయాడు ఆలి. కాని ఇప్పుడు మాత్రం చితక్కొట్టేయడానికి రెడీ అయిపోతున్నాడు.

''పైసా వసూల్'' సినిమాలో కత్తిలాంటి కామెడీ పాత్రను ఒకటి పోషించాడట ఆలి. ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరిగినప్పుడు మనోడు కూడా పూర్తి షెడ్యూల్ అంతా అక్కడే ఉండి పూరి జగన్ రాసిన కొత్త పాత్రలో పిచ్చెక్కించాడట. అక్కడ శ్రీయ అండ్ బాలయ్య మధ్యలో ఎంటర్ అయ్యే ఆలి.. తన కామెడీతో ఈసారి మామూలుగా నవ్వించడులే అంటోంది ఛార్మి. ఈ సినిమాకు ప్రొడక్షన్ యవ్వారాలు మొత్తం దగ్గరుండి చూసుకుంటున్న ఛార్మి.. ఆలి కామెడీతో రోజూ పొట్టచెక్కలయ్యేలా నవ్వేదట. అదే విషయం చెబుతూ.. పైసా వసూల్ సినిమాలో బాలయ్య అండ్ ఆలి మధ్యన నడిచే టైమింగ్ పంచులు మామూలుగా పేలవ్ అంటోంది అమ్మడు.

నిజానికి పైసా వసూల్ సినిమా ఎలా ఉంటుంది అంటూ టీజర్ వచ్చే వరకు ఎవరికన్నా సందేహం ఉన్నా మాత్రం.. టీజర్ చూశాక మతిపోయింది. అన్నా రెండు బాల్కానీ టిక్కెట్లు కావాలి అని బాలయ్య చెప్పినట్లు.. ఇప్పుడు ఆడియన్స్ కూడా అన్నా సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేసేయండి.. మేం చూడాలి.. అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,