Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 15:27:40
facebook Twitter Googleplus
Photo

సెల్ఫీ మేనియాక్ సెల్ఫీరాజాగా అల్ల‌రి న‌రేష్ తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. `సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం` ఫేమ్ జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ ను చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి నిర్మించారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. ఈ సందర్భంగా?
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ?సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సెల్ఫీ మేనియాక్ గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ నుండి ఎలాంటి కామెడి కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు యూత్ లో ఉన్న సెల్ఫీ ట్రెండ్ తో నరేష్ ఎలాంటి కామెడి చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమాను జూలై 15న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం? అన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,