Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 11:02:35
facebook Twitter Googleplus
Photo

ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే. ఫలానా అంశాలుంటే సినిమా తప్పకుండా హిట్టవుతుందని కొందరు నమ్ముతుంటారు. పాటలు ఇలా ఉంటే అభిమానులకు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం హీరోలకూ ఉంటుంది. అల్లు అర్జున్ కూడా ఈ లెక్కలోనే వెళుతున్నట్టున్నాడు. తన సినిమాలో పాటల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడు. బన్నీ లాస్ట్ ఫిలిం సరైనోడులో ఒక మెలోడియస్ సాంగ్ తో పాటు విజిల్స్ వేయించే ఊరమాస్ సాంగ్ ఒకటుంది. బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టరే సాంగులో తమన్ బీటుకు అల్లు అర్జున్ అదరగొట్టే స్టెప్పులు తోడయ్యి ఈ పాట జనానికి తెగ నచ్చేసింది.

అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోనూ మెలోడీ సాంగ్ తోపాటు మాస్ పాట ఉండేలా చూసుకున్నాడు. బాక్స్ బద్లలైపోయే అంటూ సాగే ఈ సాంగ్ లో దేవిశ్రీ ప్రసాద్ మోత మోగించేశాడు. ఇలాంటి పాటలు సినిమా చూసే వాళ్లకు మాంచి కిక్కివ్వడంతో పాటు సినిమా హిట్టవ్వడానికి ఉఫయోగపడతాయని అర్జున్ ఫీలవతాడట. డీజే సాంగ్ జనం నోళ్లలో నానుతున్న దాన్నిబట్టి చూస్తుంటే ఈ లెక్క కరెక్టేనేమో అనిపిస్తోంది. సరైనోడులో మాస్ మసాలా సాంగ్ కోసం ఐటం గర్ల్ గా హీరోయిన్ అంజలిని తీసుకొచ్చారు. డీజేలో మాత్రం ఈ పాట కోసం ప్రత్యేకంగా ఐటం గర్ల్ ను తీసుకురాలేదు. హీరోయిన్ పూజా హెగ్డేయే బన్నీతో కలిసి చిందేసింది.

,  ,  ,  ,  ,