Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 13:42:04
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అతిపెద్ద సినిమా ఏదీ అంటే.. సంక్రాంతికి విడుదలవుతున్న ''ఖైదీ నెం 150'' అనే చెప్పాలి. ఆల్రెడీ మైండ్ బ్లోయింగ్ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో ఖైదీ మొదటి రోజు కలక్షన్లు ఎర్త్ ష్యాటరింగ్ గా ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఒక యంగ్ మెగ్ హీరో చిన్నపాటి క్యామియో చేస్తున్నాడని తెలుసు కాని.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెలుస్తోంది.

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగులో ఇప్పటికే చరణ్ ఒక 30 సెకండ్ల సేపు కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. ఈ పాటలో చరణ్ కూడా డాడ్ చిరంజీవితో కలసి డ్యాన్సులు కుమ్మేశాడట. కాకపోతే కేవలం 30 సెకండ్స్ ఫుటేజ్ కోసం చాలా టేకులు తినేసినట్లు స్వయంగా చరణ్ ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కనిపిస్తున్నాడు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు. బన్నీ కూడా చిన్న క్యామియో చేస్తున్నాడని ఆయనే చెప్పారంటే.. ఖచ్చితంగా అదేదో రాకింగ్ ఎంట్రీ అయ్యే ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

గతంలో ఆల్రెడీ డాడీ సినిమాలో చిరంజీవి కోసం మెరిసిన బన్నీ.. ఇప్పుడు ఈ సినిమాలో డ్యాన్స్ చూపిస్తాడా ఇంకోటేదైనా టాలెంట్ చూపిస్తాడా అనే విషయం మనం చూడాల్సిందే.

,  ,  ,  ,  ,  ,