Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 11:16:44
facebook Twitter Googleplus
Photo

మంచి టాక్ వస్తేనే సరిగ్గా ఆఢుతుందో లేదో అని అనిపించే రోజులివి. అద్భుతహ.. బ్లాక్ బస్టర్.. ఈ టైపులో మాటలు వినిపిస్తేనే జనాలు థియేటర్లకు కదులుతున్నారు. లేకపోతే ఎటుతిరిగి మూడు నాలుగు నెలల్లో టీవీల్లో వచ్చేస్తుందిలే అని ఫిక్స్ అయిపోతున్నారు. అలాంటి సమయంలో ఓ సినిమాకు టాక్ మిక్సెడ్ గా వచ్చి.. నెగిటివ్ ప్రచారం జరిగిన తర్వాత.. భారీ వసూళ్లను సాధిస్తుందని భావించడం చాలా కష్టమైన విషయం.

కానీ అల్లు అర్జున్ దగ్గర మాత్రం ఇలాంటివేమీ చెల్లవు. బన్నీ రీసెంట్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధంకు ఫుల్ రన్ లో వచ్చిన వసూళ్ల లెక్క చూస్తే షాక్ తినాల్సిందే. మొదటి ఆట నుంచి టాక్ మిక్సెడ్ గా ఉండగా.. దర్శకుడు హరీష్ శంకర్ ఓవర్ గా రియాక్ట్ కావడంతో.. పరిస్థితి మరింత డ్యామేజ్ అయింది. అయినా సరే.. డీజేతో 72 కోట్ల వసూళ్లను రాబట్టాడంటే.. బాక్సాఫీస్ దగ్గర బన్నీ స్టామినా అర్ధమవుతుంది. వైజాగ్ 7.41 కోట్లు.. ఈస్ట్ 4.79 కోట్లు.. ఈస్ట్ 4.02 కోట్లు.. కృష్ణా 4.03 కోట్లు.. గుంటూరు 5.45 కోట్లు.. నెల్లూరు 2.40 కోట్లతో.. మొత్తంగా కోస్తా నుంచి 28.1 కోట్లను వసూలు చేశాడు డీజే. సీడెడ్ లో 10.4 కోట్ల షేర్ వసూలు కాగా.. నైజాం నుంచి 20.4 కోట్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 58.9 కోట్లను డీజే రాబట్టగలిగింది.

కర్నాటక 6.77 కోట్లు.. కేరళ 0.85 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 1 కోటి.. యూఎస్ఏ 3.33 కోట్లు.. రెస్టాఫ్ వరల్డ్ 1.15 కోట్లు.. మొత్తంగా 72 కోట్లను ఫుల్ రన్ లో వసూలు చేసింది ఈ చిత్రం.

,  ,  ,  ,  ,