Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 14:10:26
facebook Twitter Googleplus
Photo

సర్రైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు..త్వరలోనే ఈ చిత్రం సెట్స్ ఫైకి వెళ్లనుంది. ఈ లోపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధృవ చిత్రం లో గెస్ట్ అప్పీరెన్స్ చేయబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది.

దసరా కానుకగా మెగా అభిమానులను అలరించడానికి రాబోతున్న రామ్ చరణ్ కు తోడుగా బన్నీ కూడా ధృవ గా రాబోతున్నాడు. తమిళ చిత్రం తనిఒరువన్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా , గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై ఈ చిత్ర తెరకెక్కబోతుంది. గతంలో చరణ్ తో కలిసి ఎవడు చిత్రం లో బన్నీ గిస్త్ రోల్ చేయడం ఆ చిత్రం సూపర్ హిట్ కావడం తో , ఇది కూడా అలాగే హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నారు. మరికొంతమంది మాత్రం బన్నీ నటించేది లేనిది అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేం అని అంటున్నారు. ఏది ఏమైనా బన్నీ నటిస్తున్నాడనే వార్త మాత్రం మెగా ఫ్యాన్స్ ను సంతోషం లో పడేస్తుంది.

,  ,  ,  ,  ,  ,  ,