Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 13:13:38
facebook Twitter Googleplus
Photo

గత ఏడాది సమ్మర్ సీజన్లో తెలుగు ప్రేక్షకులకు బిగ్గెస్ట్ బొనాంజా ఖాయమని అనుకున్నారంతా. బాహుబలి వేసవికే వస్తుందని.. శ్రీమంతుడు కూడా ఈ సీజన్లోనే సందడి చేస్తుందని.. ఇంకా ?సన్నాఫ్ సత్యమూర్తి?.. ?లయన్? లాంటి సినిమాలతో వేసవి వేడెక్కిపోతుందని ఆశించారు తెలుగు ప్రేక్షకులు. కానీ బాహుబలి.. శ్రీమంతుడు వేసవి బరిలోంచి తప్పుకున్నాయి. ?లయన్? పెద్ద డిజాస్టర్ అయింది. చివరికి యావరేజ్ టాక్ తో మొదలైన ?సన్నాఫ్ సత్యమూర్తి? సినిమానే వేసవి విజేతగా నిలిచింది. డివైడ్ టాక్ తోనే ఆ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బన్నీ స్టామినాను రుజువు చేసింది.

ఇక ఈ ఏడాది ?సరైనోడు?తో మరోసారి మ్యాజిక్ చేశాడు బన్నీ. ఈ సినిమా ?సన్నాఫ్..? కంటే కూడా డివైడ్ టాక్ తో మొదలైంది. కానీ చివరికి బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. రూ.70 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ జనాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు భారీ అంచనాలతో విడుదలైన బ్రహ్మోత్సవం.. సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ?సరైనోడు? సమ్మర్ విన్నర్ అయింది. విశేషం ఏంటంటే.. 2014లో సైతం వేసవి విజేత బన్నీనే. ఆ సీజన్లో లెజెండ్.. మనం కూడా సూపర్ హిట్టయ్యాయి. ఐతే వాటిని మించి ?రేసుగుర్రం?కే అత్యధిక వసూళ్లొచ్చాయి. మొత్తంగా వరుసగా మూడు సమ్మర్ సీజన్లలో బన్నీ తన ఆధిపత్యాన్ని చాటుకుని ?సమ్మర్ కింగ్? అనిపించుకున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,