Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Mar-2017 11:10:47
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ హీరోస్ లో చేరిపోయాడని అనడంలో సందేహం లేదు. వరుసగా తన ప్రతీ సినిమాతో కనీసం 50 కోట్ల వసూళ్లు సాధిస్తూ అంతకంతకూ తన స్థాయి.. తన సినిమాల రేంజ్ పెంచుకుంటున్నాడు. సాధారణంగా ఈ స్థాయికి చేరుకున్నాక.. స్టార్స్ ఎవరైనా కాసింత విశాల హృదయంతో ఆలోచించేందుకు ప్రయత్నిస్తారు.

ఒరిజినల్ గా అల్లు అర్జున్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇతర సినిమాల విషయంలో మాత్రం స్టైలిష్ స్టార్ బాగా రిజర్వెడ్ గా ఉంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు కూడా అందుకు సపోర్టింగ్ గానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి2 ట్రైలర్ విషయంలో అల్లు అర్జున్ స్పందించలేదు. కానీ తమ్ముడు శిరీష్ మాత్రం బాగానే ప్రశంసలు కురిపించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్ విషయంలో కూడా బన్నీ నుంచి రియాక్షన్ లేదు.

అలాగని సోషల్ మీడియాను ఫాలో అవడనే ఛాన్స్ లేదు. తన మూవీ డీజేకి కోటి వ్యూస్ వచ్చిన కారణంగా.. తన సంతోషం వెలిబుచ్చుతూ ట్వీట్ పెట్టాడు.

,  ,  ,  ,  ,  ,