Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 10:50:24
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఈ మెగా హీరోలిద్దరూ సెపరేట్ గానే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ బావబావమరిది కలిసి నటిస్తే.. అది కూడా సినిమా అంతా కలిసి కనిపిస్తే.. ఇంకేమన్నా ఉందా.. రికార్డుల మోతలకు రాతలకు కొత్త పుస్తకాలు తెచ్చుకుని రెడీ అయిపోవద్దూ. అదే జరగనుందని తెలుస్తోంది.

నిజానికి మెగా పవర్ స్టార్-స్టైలిష్ స్టార్ ఇద్దరూ కలిసి ఎవడు సినిమాలో చేశారు. ఇందులో బన్నీది చిన్న రోల్. అయితే ఈ మెగా హీరో్స ఒక్క ఫ్రేమ్ లో కూడా పక్కపక్కన కనిపించరు. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ మూవీ ఏ స్థాయి హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు చరణ్-అర్జున్ లతో ఓ మల్టీ స్టారర్ రెడీ అయిపోతోందని టాక్. ఇంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఈ సారి ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్ రాసేసుకునే పనిలో పడిపోయాడట కూడా. నిన్నటికి నిన్నే సుకుమార్ తో తన కొత్త సినిమా మొదలుపెట్టాడు చరణ్. డీజేను ఫినిష్ చేసేసి.. ఏప్రిల్ 8న వక్కంతం వంశీ మూవీని స్టార్ట్ చేస్తాడు అర్జున్.

ఈ రెండు సినిమాలు ఒకే సమయానికి పూర్తవుతాయట. ఇవి కంప్లీట్ కాగానే.. వీళ్లిద్దరి మల్టీ స్టారర్ మొదలైపోనుందని చెబుతున్నారు. ఏంటీ నమ్మకం లేదా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై.. రీసెంట్ గానే 'చరణ్ అర్జున్' అనే టైటిల్ రిజస్ట్రేషన్ చేయించారు అల్లు అరవింద్.

,  ,  ,  ,  ,