Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jun-2017 13:21:59
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం మూవీ.. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా కూడా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో మాత్రం కలక్షన్లు కుమ్మేసింది. అంచనాలకు మించి ఈ చిత్రానికి వసూళ్లు రావడంతో.. దీనిని పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు డిజె టీమ్. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన యూనిట్.. ఆల్రెడీ సినిమా సక్సెస్ అని తేలిపోయింది కాబట్టి.. ఇంత పెద్ద హిట్ చేసిన అందరి కోసం 'థ్యాంక్యూ మీట్' అంటూ సెలవిచ్చారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ ఏమంటున్నాడంటే..

అల్లు అర్జున్ తన స్పీచ్ ప్రారంభంలోనే.. ఎంతో చక్కగా ప్రవర్తించి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు.. హిట్టహ హిట్టోస్య హిట్టోభ్యహ అంటూ డీజే డైలాగ్స్ తో అలరించాడు. మమ్మల్ని దీవించిన అందరికీ థ్యాంక్యూ. నాకు ఎప్పటినుంచో అండగా ఉంటున్న మెగాభిమానుల నుంచి సినిమాచూసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. మన సొసైటీకి లిటరేచర్ చాలా అవసరం. సొసైటీ కోసం లిరిక్ రైటర్స్ రెస్పాన్సిబిలిటీ చూపించారు. ఇక పూజా ఈ సినిమాతో కుర్రాళ్లకు లవ్వహ లవ్వస్య లవ్వోభ్యహ అంతే. ఒక మూవీకి దాదాపు 1500 మంది పని చేస్తారు. కానీ అందరికంటే ఎక్కువగా డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సందర్భంగా హరీష్ శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకంటే సినిమానే ఎక్కువగా మాట్లాడింది' అన్నాడు అల్లు అర్జున్.

రివ్యూలతో పాటు కొంత నెగిటివిటీ ఉంది. దట్స్ ఓకే. నా పాజిటివిటీతో దాన్ని ఓవర్ షాడో చేసుకుని వెళ్లాలని అనుకుంటున్నా. జనాల్లో నెగిటివ్ తక్కువే. ఎక్కువగా మంచోళ్లు ఉంటారని నమ్ముతాను. అది మరోసారి ప్రూవ్ అయింది. మా కోసం కంటే ఈ సినిమా దిల్ రాజు గారి కోసం ఎక్కువగా ఆడాలని కోరుకున్నాను. ఆయన 25వ సినిమాగా.. నాతో అల్ట్రా మాస్ మూవీ చేసినందుకు థ్యాంక్స్. సినిమాకి కలెక్షన్స్ అంటే కోట్లు కాదు.. ఆ నెంబర్ అంటే అంత ప్రేమ. వంద కోట్లంటే అంతమంది ప్రేమ మాపై కురిపించినందుకు థ్యాంక్స్

,  ,  ,  ,  ,