Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 11:36:35
facebook Twitter Googleplus
Photo

సరైనోడు యాభై రోజుల వేడుకని మీరు చేసుకోండి విదేశీ పర్యటనని నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా ఇటీవలే కుటుంబంతో కలిసి టర్కీ వెళ్లిపోయాడు బన్నీ. అక్కడ సమ్మర్ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అభిమానులేమో ఇక్కడ సరైనోడు యాభై రోజుల పండగని జరుపుకొంటున్నారు. తాను టర్కీ పర్యటనకి వెళ్తానని చెప్పగానే ఆ దేశపు అధికారులు ఎంతో గౌరవంగా విసా అందేశారు.

అంతే కాదు.. అక్కడ బన్నీ పర్యటనకి కావల్సిన ఏర్పాట్లను కూడా చేసిపెట్టినట్టు సమాచారం. ఓ స్టార్ హీరో కాబట్టి ఆయనకి ఈ గౌరవం లభించింది. దాంతో బన్నీ టర్కీతో పాటు ఇస్తాంబుల్లోని పలు ప్రాంతాలు తిరుగుతూ పర్యటనని ఆస్వాదిస్తున్నాడు. అందులో భాగంగా ఇస్తాంబుల్ లోని సుల్తాన్ అహ్మద్ కమీ బ్లూ మసీదుని కూడా సందర్శించారు. మసీదు అద్భుతంగా ఉందని ఇంత వరకూ ఇలాంటిది చూడలేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తీసిన మసీదు ఫొటోను అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

అంతే కాదు... ఒక మసీదులోకి వెళ్లి సింహాసనంపై కూర్చుని టర్కీ సుల్తాన్ లా మారిపోయాడు. అప్పటి సుల్తాన్ దుస్తుల్ని ధరించి ఫొటోలు దిగాడు. తన భార్య స్నేహారెడ్డి సుల్తానీలా మారిపోయింది. మొత్తమ్మీద బన్నీ ట్రిప్ ని బాగా ఆస్వాదిస్తున్నాడు. కొత్త సినిమా మొదలయ్యే ముందు ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,