Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 11:10:26
facebook Twitter Googleplus
Photo

డీజే.. దువ్వాడ జగన్నాధం.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ ఇంకా ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకుండానే ఇండస్ట్రీలో బోలెడంత బజ్ నెలకొంది. ప్రస్తుతం బన్నీ ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. వరుసగా ప్రతీ సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ ఉండడం.. 50 కోట్ల షేర్ వసూళ్లను పెద్ద ల్యాండ్ మార్క్ అని అందరూ అనుకుంటుంటే.. ఆ మార్క్ బన్నీకి మినిమం కలెక్షన్స్ గా మారడమే.. ఇందుకు రీజన్. తన సినిమాలకు ఇంతగా రెస్పాన్స్ అందుకోవడంలో అల్లు అర్జున్ కమిట్మెంట్ ని ప్రత్యేకించి చెప్పుకోవాలి.

దువ్వాడ జగన్నాధం మూవీలో బన్నీ రెండు షేడ్స్ ఉండే పాత్ర పోషిస్తున్నాడని.. ఇందులో ఒకటి పక్కా బ్రాహ్మిన్ పాత్ర అనే సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. అయితే.. ఈ రోల్ కోసం బన్నీ మాటలు నేర్చుకుంటున్నాడట. అది కూడా సాంప్రదాయ బ్రాహ్మిన్ లు మాట్లాడే విధానం.. ఒత్తులు ఎత్వాలు పలికే విధానం.. వారి మాట తీరు.. నడక.. నడత.. ఇలా అన్నిటినీ పక్కాగా నేర్చుకునేందుకు ఇద్దరు బ్రాహ్మణులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. వీరికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఇచ్చి.. ట్రైనింగ్ తీసుకుంటున్నాడట బన్నీ.

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం కూడా ఇలాగే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని.. అల్లు అర్జున్ పలికిన ప్రతీ మాట థియేటర్లలో కేకలు పెట్టించింది. ఇక అక్టోబర్ 21న డీజే షూటింగ్ మొదలుకానుండగా.. నవంబర్ లో బన్నీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అప్పటివరకూ బ్రాహ్మణుల దగ్గర సాంప్రదాయాల కోచింగ్ కంటిన్యూ కానుంది.

,  ,  ,  ,  ,  ,