Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 10:33:55
facebook Twitter Googleplus
Photo

కంప్యూటర్స్ వచ్చాక జనాలకు సగం మెమరీ చచ్చిపోతే.. స్మార్ట్ ఫోన్స్ చేతికొచ్చాక పూర్తిగా పోయింది. ఫోన్లో ఉండే యాప్స్ తప్ప.. సొంత నెంబర్ ని కూడా గుర్తు పెట్టుకోలేని సిట్యుయేషన్. పైగా పుస్తకంలో రాస్కునే విషయాలను కూడా.. నోట్స్ యాప్ ఓపెన్ చేసి నోట్ చేసేసుకుంటున్న జనాలు బాగా పెరిగిపోయారు. అయితే.. అల్లు వారబ్బాయి మాత్రం తాను పాత పద్ధతులో ఫాలో అయిపోతున్నానని చెబుతున్నాడు.

'నేను ట్వీట్ చేయబోయే సంగతులు' అని రాసి ఉన్న పుస్తకాన్ని ఫోటో తీసి మరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు శిరీష్. వెనకాల బ్యాక్ డ్రాప్ లో ల్యాప్ టాప్ ఉంది లెండి కానీ.. ఫ్యూచర్ లో ట్వీట్ చేయాల్సిన సంగతులను కూడా పుస్తకంలో నోట్ చేస్తాడంటే.. సోషల్ మీడియాకి ఈ కుర్రాడు ఇచ్చే వాల్యూ అర్ధమవుతుంది. 'రిమైండర్ యాప్స్ కంటే గుర్తుంచుకునేందుకు నేను పాత నోట్స్ పద్ధతి పైనే ఆధారపడతా' అని రాసుకొచ్చాడు శిరీష్.

లవ్ రైటింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ చూస్తే.. అల్లు కుర్రాడికి రైటింగ్ అంటే ఇష్టమన సంగతి తెలిసిపోతోంది. ఈ కాలంలో ఇంకా ఖరీదైన 'నోట్ బుక్' గాడ్జెట్స్ వాడే సెలబ్రిటీలు కాకుండా.. రాసుకునే నోట్సులు ఉపయోగించుకునే శిరీష్ లాంటి వాళ్లు ఉన్నారంటే.. నమ్మడం కొంచెం కష్టమైనా.. ఇది నిజమే

,  ,  ,  ,  ,  ,