Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 15:18:31
facebook Twitter Googleplus
Photo

తెలుగులో అమలాపాల్ కి సరైన సినిమానే పడలేదు. చరణ్ - నాని - నాగచైతన్య... ఇలా పేరున్న కథానాయకులతోనే నటించింది. కానీ విజయం మాత్రం దక్కలేదు. అయితే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపడినప్పటికీ ఇక్కడి నుంచి ఆమెకి చాలానే ఆఫర్లు వెళ్లాయి. కథానాయకులు కూడా ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు. కానీ అమలానే పెళ్లి కోసమని తెలుగులో వచ్చిన ఆఫర్లను కూడా కాదనుకొంది. ఒప్పుకొన్న ఓ సినిమాని కూడా చివరి నిమిషంలో కాదనుకొంది. దర్శకుడు విజయ్ తో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించినప్పటికీ... తమిళం - మలయాళం భాషలకే పరిమితమైంది. ఈమధ్యే విజయ్ తో పొరపచ్ఛాలు రావడంతో ఆయనకి దూరమైంది. మళ్లీ తన కెరీర్ పై దృష్టిపెట్టింది. తెలుగులోనూ అవకాశాల్ని సొంతం చేసుకోవాలని చూస్తోందట. ఆ ఆసక్తిని గమనించే తెలుగు నుంచి ఆమెకి ఆఫర్లు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఓ కొత్త సినిమాలో హీరోయిన్ గా అమలాపాల్ ని ఎంచుకొనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఓ మలయాళం సినిమాకి రీమేక్ గా `అలా ఎలా` ఫేమ్ అనీష్ కృష్ణ తెరకెక్కించనున్న ఆ సినిమా ఆఫర్ తో అమలాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మరి స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడే అమలాపాల్ ఇప్పుడు అల్లరి నరేష్ తో కలిసి నటిస్తుందా అనేదే సందేహం. అసలే ఇటీవల అల్లరి నరేష్ కి సరైన సక్సెస్ లు లేవు. ఈ పరిస్థితుల్లో అమలాపాల్ అల్లరి నరేష్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,