Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 11:32:57
facebook Twitter Googleplus
Photo

కబాలి చిత్రంపై బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కన్ను పడిందా?ఇందుకు కోలీవుడ్‌లో అవుననే ప్రచారమే జరుగుతోంది.ఒక ప్రపంజనంలా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన చిత్రం కబాలి.ప్రపంచ సినిమానే అబ్బురపడేలా వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రం కబాలి.మలాయి భాషలో అనువాదం అయిన తొలి భారతీయ చిత్రం కబాలి.ఇలా పలు రికార్డులను బద్దలు కొడుతున్న కబాలి చిత్రానికి కర్త,కర్మ,క్రియ సూపర్‌స్టార్ రజనీకాంత్ అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.అలా ప్రపంచ సినీ అభిమానుల్ని ఖుషీ పరుస్తున్న కబాలిపై బిగ్‌బీ కన్ను పడడంలో ఆశ్చర్యం ఏముంది.

పైగా రజనీకాంత్‌కు అమితాబ్‌కు మధ్య మంచి స్నేహబంధం ఉంది.అమితాబ్ హిందిలో నటించిన చిత్రాల తమిళ రీమేక్‌లో రజనీకాంత్, ఈయన తమిళంలో నటించిన చిత్రాల రీమేక్‌లో ఆయన నటించారు.అంతే కాదు ఇద్దరూ కలిసి హిందిలో నటించిన చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి.కాగా మూడు రోజుల్లోనే రూ 300 కోట్లు వసూల్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న కబాలి చిత్రంపై అమితాబ్‌బచ్చన్‌కు ప్రత్యేకం అనిపించిందట.కాగా కబాలి చిత్రం హిందిలో అనువాదం అయ్యి బాలీవుడ్‌లో ప్రదరద్శింపబడుతోంది.అయినా దీన్ని నేరుగా నిర్మించి నటించాలన్న ఆసక్తిని బిగ్‌బీ వ్యక్తం చేసినట్లు మీడియాలో ప్రచారం జరగుతోంది.కబాలి చిత్రంలో రజనీకాంత్ పాత్ర అమితాబ్‌కు బాగా నచ్చినట్లు,అందుకే దీన్ని హిందిలోకి రీమేక్ చేయాలన్న చర్చ జరుగుతున్నట్లు సమాచారం

,  ,  ,  ,  ,  ,