Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 12:20:27
facebook Twitter Googleplus
Photo

వింతైన ఆలోచనలతో పిన్ పాయింట్ ప్రశ్నలతో సోషల్ మీడియాలో అలరిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తనని ఫాలో అవుతున్న వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు ఏదో ఒకటి ఆశ్చర్యపరిచేలా తెలియజేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అలాంటి సంధర్భం ఒకటి వచ్చింది. రాము డైరెక్ట్ చేస్తున్న హింది సినిమా సర్కార్ 3 విడుదలకు సిద్దమైంది.

నిన్న రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3లో ఒక పాటను విడుదల చేశారు. ఈ మొదటి పాట వినాయకుడు పై ఉంటుంది. ఈ పాటలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? బాలీవుడ్ బిగ్ బి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ పాట పాడారు. గతంలో కూడా ఆయన పాడటం జరిగింది కాకపోతే ఈ సినిమా హీరో ఆయనే కాబట్టి పైగా ఆయన కూడా గణపతి భక్తుడే కాబట్టి ఈ పాటకి మరింత వైవిధ్యం ఏర్పడింది. ఇక మరో విషయం ఏంటంటే.. రామ్ గోపాల్ వర్మను అమితాబ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఇంత వరుకు బిగ్ బి ఎప్పుడు ఏ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయలేదు. మొదటిసారి సర్కార్ 3 ప్రమోషన్ కోసం రాముని ఇంటర్వ్యూ చేస్తున్నారు బిగ్ బి మే 8న. తన మాటల కంటే చూపులతో చంపేసే అమితాబ్.. ఈ ఇంటర్యూ ఎలా చేస్తారో చూడాలి.

ఈ సినిమాలో బిగ్ బి తో పాటు యామి గౌతమ్ జాకీ శ్రోఫ్ మనోజ్ బాజ్పాయ్ లు కూడా నటిస్తున్నారు. మే 12 న విడుదలకు సిద్దం చేశారు. అసలే రాము కి అమితాబ్ అంటే చాలా పిచ్చి

,  ,  ,  ,  ,