Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:34:15
facebook Twitter Googleplus
Photo

హాట్ యాంకర్ అనసూయ.. మొదటిసారిగా ఐటెం సాంగ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సాయిధరం తేజ్ హీరోగా రూపొందుతున్న విన్నర్ మూవీలో.. ఐటెం గాళ్ గా అనసూయ చిందులు వేసింది. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

'అనసూయా.. అనసూయా' అంటూ సాగే పాట కోసం.. తేజు-అనసూయలను తెగ డ్యాన్సులు చేసేశారు. సాంగ్స్.. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ విషయంలో మెగా హీరోలు ఏ రేంజ్ లో డ్యాన్సులు వేస్తారో చెప్పాల్సిన పనిలేదు. మరి అనసూయకేమో బుల్లితెర స్టేజ్ పై చిన్న చిన్న డ్యాన్సులు తప్ప.. మరీ ఈ రేంజ్ డ్యాన్సులు అంతగా అలవాటు కాలేదు. అందుకే తేజుతో డ్యాన్సులు చేసేసరికి చుక్కలు కనిపించాయట ఈ ఐటెం భామకి. ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులకు బోలెడన్ని కబుర్లు చెప్పిన ఈ హాటీ.. ఆ సంగతి కూడా చెప్పేసింది. 'సాయిధరం తేజ్ చేస్తున్నవి విన్నర్ మూవీ అయినా... తను నిజంగా స్టన్నర్. అమేజింగ్ అంతే. చాలా డెడికేటెడ్ పర్సన్ తను. డ్యాన్సులో అతని స్పీడ్ అందుకోవడం నా వల్ల కాలేదు' అని చెప్పేసింది అనసూయా.

ఓ హాటీ అంత డైరెక్టుగా లైవ్ లో పొగిడేసిందంటే.. ఈ పాటలో తేజు చేసిన రచ్చ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. అంతేలెండి.. అనసూయ పక్కనుంటే ఆ మాత్రం స్పీడ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది కదా.

,  ,  ,  ,  ,  ,