Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2017 10:49:26
facebook Twitter Googleplus
Photo

యాంకరింగ్ కి గ్లామర్ హంగులు అద్దింది అనసూయ - రష్మీలే. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఫిజిక్ అండ్ అప్పియరెన్స్ తో ఆడియన్స్ మతులు పోగొట్టేసి జనాల్లో తెగ క్రేజ్ పెంచుకున్నారు. వీళ్లు టీవీ ప్రోగ్రాంలతో వచ్చిన పాపులారిటీ ద్వారా ఈజీగా సినిమాల్లోకి అడుగు పెట్టేయగలిగారు. వీళ్లిద్దరికీ ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ అండ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలే. వీటిలో రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తుండగా.. అనసూయ జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది.

ఈ మధ్య కాలంలో ఈ భామలిద్దరిలో ఒకరు ఈ పాపులర్ ప్రోగ్రాం నుంచి పక్కకు తప్పుకుంటారనే టాక్ వినిపించింది. ఈ ప్లేస్ ను హరితేజ భర్తీ చేస్తుందనే టాక్ కూడా వచ్చింది. త్రివిక్రమ్ సినిమా ‘అ..ఆ’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హరితేజ ఈమధ్య మాటీవీలో ప్రసారమైన రియాలిటీషో బిగ్ బాస్ ద్వారా బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించుకుంది. తన టాలెంట్ ద్వారా ఫైనల్ వరకు ఎలిమినేట్ అవకుండా ఆటను కంటిన్యూ చేయగలిగింది. అలాంటి హరితేజ జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తుందనే మాట వినిపించినా అదంతా ఓ రూమరేనని జబర్దస్త్ నిర్మాతలు చెబుతున్నారు.

జబర్దస్త్ - ఎక్స్ ట్రా జబర్దస్త్ లకు అనసూయ - రష్మిలే కొనసాగుతారని.. ప్రస్తుతం వారిని మార్చే ఉద్దేశమేం లేదని ఛానల్ ప్రతినిధి ఒకరు తెలిపారు

,  ,  ,  ,  ,