Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 11:04:17
facebook Twitter Googleplus
Photo

బుల్లితెరపై అందాలు ఆరబోసి.. వెండితెరను తెగ వేడెక్కించేస్తున్న అనసూయ ఇప్పుడు మంచి స్పీడ్ మీదే ఉంది. కెరీర్ లో కొత్త కేరక్టర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. అనేక ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన అనసూయ ప్రమాదానికి గురైంది.

బెంగళూరులో ఓ కార్యక్రమానిక అటెండ్ అయిన అనసూయ.. అక్కడి నుంచి తన ఆడికారులో తిరిగి హైద్రాబాద్ కు బయల్దేరింది. అయితే.. అనంతపూర్ జిల్లాలో ఈమె కారుకు ప్రమాదానికి గురైందన్న వార్త ఇప్పుడు సంచలనం అయిపోయింది. సీమ జిల్లాలోకి వచ్చాక.. పెనుగొండ ప్రాంతంలో అనసూయ ప్రయాణిస్తున్న కారుతో.. ఎదురుగుండా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అనసూయ ఆడి కారుతో పాటు.. ఆమెకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. దీంతో అనంతపూర్ లోని ఓ ఆస్పత్రికి వెంటనే అనసూయను తరలించి.. చికిత్స అందించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం నుంచి తిరిగి ఓ ట్యాక్సీలో హైద్రాబాద్ కు బయల్దేరింది అనసూయ. ఈ సంఘటనలో అనసూయ కారు బాగానే డ్యామేజ్ అయిందని తెలుస్తోంది.

,  ,  ,  ,