Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 11:59:18
facebook Twitter Googleplus
Photo

బుల్లితెర నుంచి వెండితెర పైకి వచ్చేందుకు చాలా మంది అందాల భామలే ఉత్సాహం చూపుతుంటారు. కానీ సిల్వర్ స్క్రీన్ పై తమకు హీరోయిన్ ఆఫర్స్ కానీ.. బాగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కావాలని పట్టుబట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ యాంకర్ లాస్య మాత్రం ఈ విషయంలో తనను తాను ఓ స్థాయి వరకు సెటిల్ చేసేసుకుంటోంది.

యాంకర్ లాస్య పెళ్లి గురించి మాట్లాడుకున్న స్థాయిలో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో మరే యాంకర్ గురించి చర్చించుకుని ఉండరు. మెల్లగా పెళ్లి హంగామాలోంచి బయటకు వస్తున్న లాస్య.. ఇప్పుడు కెరీర్ పై దృష్టి పెట్టింది. సినిమాల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కాకపోతే.. లాస్య లాంటి డిమాండ్ ఉన్న అందగత్తె.. హీరో చెల్లెలి పాత్రలతో సరిపెట్టేసుకోవడం కాసింత ఆశ్చర్యపోయే విషయమే. ఈ నెల 9నుంచి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ మూవీ ప్రారంభం కానుంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లెలిగా నటించనుందట లాస్య.

కళ్యాణ్ రామ్ కి జోడీగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించనుంది. తన తొలి టాలీవుడ్ హీరోతో.. మళ్లీ ఇన్నేళ్లకు జట్టు కడుతోంది కాజల్. ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. ఎంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయినా.. హీరో సిస్టర్ పాత్రలో యాంకర్ లాస్యను చూడ్డం అంటే.. ఆమె ఫ్యాన్స్ కు కాసింత నిరుత్సాహం కలిగించే విషయమే.

,  ,  ,  ,  ,  ,