పటాస్ షో పాపులరైయిన యాంకర్ శ్రీముఖి. వెండితెరపై కూడా మెరిసింది. ప్రేమ ఇష్క్ కాదల్ లో హీరోయిన్ గా పరిచయమైన శ్రీముఖి తర్వాత త్రివిక్రమ్ జులాయి లో కనిపించింది. ఈ మధ్యనే వచ్చిన నాని జెంటిల్ మెన్ లో కూడా జర్నలిస్ట్ గా దర్శనమిచ్చింది. ఇప్పడు ?థాంక్ యూ మిత్రమా ? అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుంది. తాజాగా లైవ్ చాట్ లో కనిపించిన శ్రీముఖి తన మనోగతాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ లైవ్ చాట్ లో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ఎవర్నైనా ప్రేమిస్తున్నారా? అని చాలా మంది వేసిన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఇచ్చిన శ్రీముఖి.. ?అవును? అని చెప్పింది. అయితే ఇక్కడ చిన్న మెలిక పెట్టింది. ?ప్రేమిస్తున్న. ఎవర్నో కాదు. ప్రస్తుతం నేను నటించిన షార్ట్ ఫిల్మ్ ?థాంక్ యూ మిత్రమా ?ని? ?అని ముసిముసి నవ్వులు నవ్వేసింది శ్రీముఖి. ఆ తర్వాత కాసేపటికే .. నేను ప్రేమలో లేను. పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు. ఐదేళ్ల తర్వాతనే పెళ్ల అని చెప్పుకొచ్చిందీ క్యూట్ యాంకర్.