Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 13:12:45
facebook Twitter Googleplus
Photo

తెలుగమ్మాయి అంజలి.. టాలీవుడ్ జనాలను సీతమ్మగా బాగానే అలరించింది. ఆ తర్వాత గీతాంజలిగా లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ సక్సెస్ సాధించినా.. అదే జోరును కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ గా వచ్చిన ప్రాబ్లెమ్స్ ను ప్రొఫెషన్ లోనూ చూపించడమే.. అంజలి కెరీర్ కి దెబ్బ వేసిందంటారు సినీ జనాలు. ఈ భామ నటించిన చిత్రాంగద అనే మూవీ షూటింగ్ అయిపోయినా.. రిలీజ్ కాలేకపోయింది.

దాదాపు అటకెక్కేసినట్లే అనుకున్న చిత్రాంగదకు ఇప్పుడు మోక్షం లభించనుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. రీసెంట్ గా అభిషేక్ పిక్చర్స్ అధినేతలు చూపించడం జరిగింది. మూవీ ఔట్ పుట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ డిస్ట్రిబ్యూషన్ కం ప్రొడక్షన్ హౌస్.. టోటల్ గా రైట్స్ ను తీసేసుకున్నారని తెలుస్తోంది. మరీ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చేయకపోయినా.. పెట్టిన ఖర్చు కంటే కొంత ఎక్కువ మొత్తానికే హోల్ అండ్ సోల్ రైట్స్ ను కొనేసిందట అభిషేక్ పిక్చర్స్.

బడా సంస్థకు చిత్రాంగద రైట్స్ చేరడంతో.. ఇక రిలీజ్ కి అడ్డంకులు ఇబ్బందులు అన్నీ తొలగిపోయినట్లే. ఈ నెలాఖర్లో ఆడియా ఫంక్షన్ నిర్వహించి.. డిసెంబర్ లో మూవీని థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,