Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 10:44:42
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ కొత్త సినిమాపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండగా.. ఇప్పుడు టైటిల్ తో పాటు ప్రీ లుక్ కూడా వచ్చేసింది. సౌతిండియా సూపర్ స్టార్ కొత్త సినిమాకి కాలా అనే టైటిల్ ఫైనల్ చేశారు. కాలా కరికులన్ అనేది పూర్తి టైటిల్ కాగా.. కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

కాలా ముూవీలో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి పాటిల్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముూవీకి ఈ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అంటున్నారు. కథను మలుపు తిప్పే ఈ రోల్ కోసం పెర్ఫామెన్స్ యాక్ట్రెస్ కోసం వెతికిన మేకర్స్.. చివరకు అవార్డ్ ఫిలిం నా బంగారు తల్లిలో నటించిన అంజలి పాటిల్ కు మొగ్గు చూపారు. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ.. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రానికి రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాత కావడం విశేషం. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ ను పూర్తి చేసేశారు.

,  ,  ,  ,  ,