Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 11:31:07
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరపైకి వస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'ముకుంద' సినిమాలో ఆయన నటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ చిన్న పాత్రలో ఆయన కాసేపు కనిపిస్తాడనీ, దర్శకుడి కోరికపై ఆయన నటించడానికి అంగీకరించాడనీ సమాచారం. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. వరుణ్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో దీనిపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి!

,  ,  ,  ,  ,