Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 11:47:04
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లోకి సూపర్ ఫాస్ట్ గా దూసుకొస్తున్న మలయాళీ బ్యూటీస్ లో అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉంది. హీరోయిన్ గా మల్లూవుడ్ లో ఒక సినిమాలోనే కనిపించినా.. తెలుగులో సూపర్ స్పీడ్ చూపిస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా.. మరొకటి సెట్స్ పై ఉంది. నాని నటించిన మజ్నుతో.. ఈ వారంలో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనుండగా.. గోపీచంద్ ఆక్సిజన్ లోను.. రాజ్ తరుణ్ మూవీలోనూ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంకా ఒక సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రాకముందే ఈ భామకు సీనియర్లతో పోలికలు మొదలైపోయాయి. లుక్స్ విషయంలో జూనియర్ అమలాపాల్ లా కనిపిస్తోందని.. పెర్ఫామెన్స్ విషయంలోనూ ఆ రేంజ్ ట్యాలెంట్ చూపిస్తే.. తిరుగుండదని అంటున్నారు. ప్రస్తుతం మజ్ను ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ.. ఫోటో సెషన్స్ కు పోజులు ఇస్తోంది. స్కిన్ టోన్ నుంచి.. బాడీ షేపుల వరకూ.. లుక్స్ నుంచి డ్రెసింగ్ వరకూ.. అమలాపాల్ ని గుర్తు చేసేస్తోందని తెలుగు ఇండస్ట్రీ జనాలు చెప్పేసుకుంటున్నారు.

అను ఇమ్మాన్యుయేల్ తో పాటు.. మరికొందరికి కూడా ఇలాంటి పోలికలు ఉన్నాయి. ఈ రోజుల్లో సినిమాలో కనిపించి రేష్మి రాథోడ్ కి.. జూనియర్ త్రిష అనే కామెంట్స్ ఉండగా.. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం హీరోయిన్ మంజరి ఫడ్నీస్ ను జూనియర్ జయప్రద అంటూ ఉంటారు తెలుగు సినీ జనాలు.

,  ,  ,  ,  ,  ,  ,