Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2017 12:44:18
facebook Twitter Googleplus
Photo

మెగా కాంపౌండ్ లో హీరోయిన్ గా నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపించడానికి కారణం ఇదే. ఎవరో ఒక హీరోతో నటించే అవకాశం వస్తే.. మెల్లగా అందరినీ కవర్ చేసే అవకాశం వస్తూ ఉంటుంది. ఇలా ఒకరికి మించి మెగా హీరోలను వరుసగా కవర్ చేసిసిన హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. ఇప్పుడా లిస్ట్ లో మలయాళీ భామ అను ఇమ్మాన్యుయేల్ కూడా చేరిపోనుంది.

నాని సినిమా మజ్ను మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అను ఇమాన్యుయేల్.. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో నటించింది. ఈమె మొదట సైన్ చేసిన టాలీవుడ్ మూవీ గోపీచంద్ ఆక్సిజన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో నటిస్తుండడంతో.. అను క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడీ భామను అల్లు అర్జున్ కు హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న నా పేరు సూర్య కోసం పలువురు హీరోయిన్లను అనుకుంటున్నా.. వీరిలో అను ఇమాన్యూయేల్ పేరు టాప్ లో ఉండడం విశేషం.

కథ ప్రకారం హీరో పాత్ర.. అల్లు అర్జున్ కు చాలా కొత్తగా ఉంటుందని.. అందుకే హీరోయిన్ విషయంలో కూడా విభిన్నంగా ఉండేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,