Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 10:29:51
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రామ్ చరణ్ అండ్ సుకుమార్ సినిమా నుండి తప్పించబడటం అనేదే ఇండస్ర్టీలో పెద్ద చర్చగా మారిపోయింది. అయితే ఉన్నట్లుండి సుకుమార్ ఈ సినిమా నుండి అనుపమను సైడ్ చేసేద్దాం అనేంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడంటారూ? ఆల్రెడీ లుక్ టెస్టులు కూడా చేసి.. చరణ్ ప్రక్కన అమ్మాయి బాగా సెట్టవ్వుద్ది అని అనుకున్నాకనేగా.. ఆమెతో ఎగ్రిమెంట్ చేసుకుంది.. మరి ఎందుకు తీసేశారు?

నిజానికి ఇప్పటివరకు వినిపిస్తున్న విషయం ఏంటంటే.. అనుపమ గ్లామర్ షో విషయంలో ఎట్టిపరిస్థితుల్లో కుదరదు అని చెప్పడంతోనే ఈ పాపను తీసేశారని అనుకున్నారు. కాని శతమానం భవతి హిట్టవ్వడంతో అనుపమ వెంటనే రెమ్యూనరేషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేసిందని.. ఆమె 60 లక్షలు అడగటంతోనే ఆమెను వద్దని డిసైడయ్యారని ఇప్పుడు వినిపిస్తోంది. ముఖ్యంగా సమంత వంటి స్టార్లు రెమ్యూనరేషన్ తగ్గించుకుని 80 లక్షల రేంజులో పని చేస్తానని చెప్పడంతో.. అంత డబ్బిచ్చి అనుపమ పరమేశ్వరన్ ను ఎందుకు తీసుకోవడం అనుకున్నారట. అందుకే ఆమెను తప్పించేశారట.

ఇకపోతే నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో చేయాల్సిన సినిమా నుండి కూడా అమ్మడు తప్పుకోవడానికి ఇదే కారణమట. రాజు గారు తక్కువ రేటుకే చేయమనడం.. ఆమె మాత్రం మార్కెట్ పెరిగిందంటూ చాలా ఎక్కువగా డిమాండ్ చేయడంతో.. డీల్ సెట్టవ్వలేదట. అసలు ఈ డిస్కషన్లు అన్నీ ఎందుకులే అని అనుపమ స్వయంగా సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,