Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 11:25:55
facebook Twitter Googleplus
Photo

అనుష్క చేతిలో ఉన్న చేయబోతున్న సినిమాలను వాటి బడ్జెట్ ను చూస్తే.. అనుష్కకి ఇంత భారీ డిమాండా అనిపించక మానదు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న బాహుబలి2 లో హీరోయిన్ అనుష్కనే. సూర్యతో చేస్తున్న సింగం సీక్వెల్ ఎస్3 లోనూ అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇవి రెండూ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటూ ఉండగా.. భాగమతి అనే చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

ఇవన్నీ కాక ఇప్పుడు మరో రెండు భారీ చిత్రాలు అనుష్క ఖాతాలోకి చేరాయని తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అనుష్కను సంప్రదించాడట డైరెక్టర్. చిరంజీవితో నటించేందుకు తన అంగీకారం చెప్పిందని అంటున్నారు. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నటించనున్న తర్వాతి ప్రాజెక్టులో హీరోయిన్ గా నటించే ఆఫర్ కూడా అనుష్కకే దక్కిందని తెలుస్తోంది.

ఒకేసారి టాలీవుడ్ మెగాస్టార్ - కోలీవుడ్ సూపర్ స్టార్ లతో సినిమాలు చేసేయడమంటే చిన్న విషయం కాదు. పైగా ఇప్పటికే చేతిలో 3-4 బడా ప్రాజెక్టులు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్నేసి భారీ చిత్రాలను ఖాతాలో వేసుకున్న అనుష్కను.. టాప్ హీరోయిన్ అని కాకుండా వేరే ఏమన్నా సంబోధిస్తే అస్సలు బాగోదు.

,  ,  ,  ,  ,  ,