Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2015 17:43:35
facebook Twitter Googleplus
Photo

ఒకరి సినిమాకి ఇంకొకరు సాయం చేసుకోవడం.. ఈ కాన్సెప్టు కొత్తదేమీ కాదు. ఇప్పటికే టాలీవుడ్ లో పాపులర్ అయిన కాన్సెప్టే. అయితే అది కింగ్ నాగార్జున కోసం స్వీటీ అనుష్క కామియోలో నటించడం అలాగే స్వీటీ కోసం కింగ్ ఓ అతిధి పాత్రకు అంగీకరించడం .. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. డీటెయిల్స్ లోకి వెళితే ..

స్వీటీ కథానాయికగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరో చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. సైజ్ జీరోలో నాగ్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అయితే చెల్లుకు చెల్లు అనుకుందో ఏమో! స్వీటీ కూడా కింగ్ సినిమాలో అతిథి పాత్రలో మెరవనుంది. నాగార్జున కార్తీ మల్టీ స్టారర్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో అనుష్క ఓ కీలకపాత్రలో నటిస్తోంది. కథని మలుపు తిప్పే రోల్ ఇది.

నాగార్జున ఈ చిత్రంలో క్వాడ్రి ప్లెజిక్ గా (నాభి కింద భాగం శరీరమంతా చచ్చు పడిపోవడం) వీల్ చైర్ కి అంకితమయ్యే వాడిగా నటిస్తున్నాడు. అతడికి కేర్ టేకర్ గా కార్తీ నటిస్తున్నాడు. అయితే క్వాడ్రిప్లెజిక్ లేక ముందు అందరిలాగే నాగ్ కూడా అందరిలాంటివాడే. తనూ ఓ అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. గాళ్ ఫ్రెండ్ తో గడిపిన ఆ క్షణాల్ని గుర్తు తెచ్చుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనుష్క ఎంట్రీ ఇస్తుందిట. అంటే మాజీ గాళ్ ఫ్రెండ్ గా కనిపించబోతోంది. మొత్తానికి కింగ్ స్వీటీ ఇచ్చి పుచ్చుకుంటున్నారన్నమాట. ప్రస్తుతం అనుష్క ప్యారిస్ లో షూటింగులో బిజీ.

,  ,  ,  ,